అమరావతిముచ్చట్లు:
ఏపీలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు మరియు నగర పంచాయతీలలో పోలింగ్ కు 48 గంటల ముందే మద్యం దుకాణాలను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 28వ తేదీన పోలింగ్ జరగనుండగా, 30వ తేదీన ఓట్ల లెక్కింపు మరియు ఫలితాల ప్రకటన ఉంటుంది. ఈ రోజుల్లో మద్యం దుకాణాలు తెరవకుండా కఠిన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను ఆదేశించింది.
Tags: Liquor shops to close 48 hours before polling