October 18, 2026
Explore
మదనపల్లెలో నామినేషన్ కేంద్రం వద్ద భారీ పోలీసు బందోబస్తు

మదనపల్లెలో నామినేషన్ కేంద్రం వద్ద భారీ పోలీసు బందోబస్తు

October 18, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

మదనపల్లె మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ముగింపు సందర్భంగా జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు స్థానిక దొంతి వీధిలోని నామినేషన్ కేంద్రం వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

డీఎస్పీ వంశీధర్ గౌడ్ ఆధ్వర్యంలో సీఐలు, ఎస్‌ఐలు, స్థానిక పోలీసులు, ఏఆర్, స్పెషల్ పార్టీ బలగాలను మోహరించి పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు.

నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా సాగేందుకు డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతరం నిఘా ఏర్పాటు చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హెచ్చరించారు.

Tags: Heavy police security at the nomination center in Madanapalle