October 18, 2026
Explore
ఏపీలో అక్టోబర్ 21 వరకు వర్షాలు.. మూడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్!

ఏపీలో అక్టోబర్ 21 వరకు వర్షాలు.. మూడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్!

October 18, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఆంధ్రప్రదేశ్‌లో అక్టోబర్ 21 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. అక్టోబర్ 18న చిత్తూరు, తిరుపతి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాల సూచనతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

రాయలసీమ, కోస్తాంధ్రలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు, బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.

తెలంగాణలోనూ కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Tags; Rains in AP until October 21; orange alert issued for three districts!