March 29, 2026
Explore
గంజాయి అక్రమ రవాణాపై పాకాల పోలీసుల దాడి – నలుగురు అరెస్ట్

గంజాయి అక్రమ రవాణాపై పాకాల పోలీసుల దాడి – నలుగురు అరెస్ట్

March 29, 2026 | Andhra Pradesh

  • తిరుపతి ముచ్చట్లు:
  • 5.1 కిలోల గంజాయి స్వాధీనం – మరో నిందితుడు పరారీ.
  • తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు ఐపిఎస్., ఆదేశాలు, చంద్రగిరి ఎస్డీపీఓ బేతపూడి ప్రసాద్ సూచనల మేరకు పాకాల అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా మరియు విక్రయాలపై ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగింది.
  • ఈ క్రమంలో 28-03-2026 తేదీన విశ్వసనీయ సమాచారం మేరకు పాకాల ఎస్ఐ సి. తరుణ్ తన సిబ్బందితో కలిసి పాకాల మండలం కుందేవారిపల్లి, సంకంపల్లి రోడ్ సమీపంలోని కొండగుట్ట ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు. పోలీసులు అక్కడికి చేరుకోగానే అనుమానాస్పదంగా ప్రవర్తించిన నలుగురు వ్యక్తులను వెంటాడి పట్టుకోవడం జరిగింది.
  • పట్టుబడిన ముద్దాయిల వివరాలు:
  • పూజారి ముని (28 సం.), S/o పూజారి మురళి, మాంచాల వీధి, తిరుపతి.
  • ముల్లతంటి రాకేష్ (26 సం.), S/o సుబ్రహ్మణ్యం, లింగేశ్వర నగర్, తిరుపతి.
  • సింగనమల్లి సునీల్ కుమార్ (32 సం.), S/o సత్యనారాయణ, తాతయ్యగుంట, తిరుపతి.
  • అక్కనగారి వెంకటసాయి (21 సం.), S/o ఢిల్లీ కుమార్, తాతయ్యగుంట, తిరుపతి.
  • వారి వద్ద నిర్వహించిన తనిఖీలలో సుమారు 5.1 కిలోల గంజాయి (8 పెద్ద ప్యాకెట్లు, 11 చిన్న ప్యాకెట్లు) స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు 50 వేల రూపాయల విలువ చేస్తుంది. విచారణలో, ముద్దాయిలు తిరుపతి ప్రాంతం నందు జనార్ధన్ వద్ద నుండి తక్కువ ధరకు గంజాయిని తెచ్చుకొని పాకాల మరియు తిరుపతి పరిసర ప్రాంతాలలో చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి విక్రయిస్తున్నట్లు వెల్లడైంది. తిరుపతి నందు జనార్ధన్ అనే వ్యక్తి విశాఖపట్నం వెళ్ళి అక్కడ నుంచి పెద్ద మొత్తం లో రైలు నందు, బస్సులలో తెచ్చి తిరుపతి నందు ముద్దాయిలకు తక్కువ రేటుకి అమ్ముతూ ఉన్నారు.
  • ఈ ఘటనపై పాకాల అర్బన్ పోలీస్ స్టేషన్‌లో పాకాల ఇన్స్పెక్టర్ టి చిన్న గోవిందు గారు కేసు నమోదు చేసి, ముద్దాయిలను అరెస్ట్ చేసి గౌరవ న్యాయస్థానంలో హాజరు పరచడం జరిగింది.
  • ఇంకా ఈ కేసులో తిరుపతి కి చెందిన జనార్ధన్ ను A-5 గా గుర్తించిన మరో నిందితుడు పరారీలో ఉండగా, అతని కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. స్వాధీనం చేసుకున్న గంజాయిని రసాయన పరీక్షల నిమిత్తం పంపించే చర్యలు చేపట్టడం జరిగింది.
  • పోలీసుల హెచ్చరిక.
  • గంజాయి వంటి మత్తు పదార్థాల రవాణా, విక్రయం మరియు వినియోగం చట్టవిరుద్ధమైనవి. ఇటువంటి అక్రమ కార్యకలాపాలలో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయి. ప్రజలు ఎవరైనా ఇలాంటి కార్యకలాపాలను గమనించిన వెంటనే సమీప పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Tags: Pakala Police Raid on Illicit Cannabis Trafficking – Four Arrested