October 10, 2026
Explore
SDPI ఉమ్మడి జిల్లా సమావేశం

SDPI ఉమ్మడి జిల్లా సమావేశం

October 10, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు:

– రాబోయే స్థానిక ఎన్నికలే లక్ష్యంగా కార్యాచరణ

ఈరోజు SDPI పార్టీ జిల్లా కార్యాలయం నందు జిల్లా అధ్యక్షులు జనాబ్ యూసుఫ్ , కార్యదర్శి రోషన్ యునుస్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా SDPI రాష్ట్ర అధ్యక్షులు జనాబ్ అబ్దుల్ ఖాన్ సాబ్ , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్వర్ భాషా , కార్యదర్శి సుభాన్ మరియు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కన్వీనర్ ఇర్ఫాన్ గారు హాజరయ్యారు.ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ ఖాన్ సాబ్ మాట్లాడుతూమా రాజకీయం అధికారం కోసం కాదు, ఆకలి నుండి – భయం నుండి ప్రజలకు విముక్తి కల్పించడం కోసం. పార్టీ కార్యకర్తలు రాబోయే స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రజల్లో ఉంటూ, ప్రజా సమస్యలపై పోరాడాలి.”అని పిలుపునిచ్చారు.అనంతరం జిల్లా అధ్యక్షులు యూసుఫ్ మాట్లాడుతూ”మేము ఎన్నికలప్పుడే వచ్చే నాయకులం కాదు, ఎల్లప్పుడూ ప్రజల్లో ఉండే సేవకులం. ఇదే SDPI నినాదం. పుంగనూరులో నిజమైన మార్పు కోసం సిలిండర్ గుర్తును గెలిపించండి.”అని అన్నారు.

పుంగనూరు మున్సిపాలిటీ ఇంచార్జీల వివరాలు:
పుంగనూరు మున్సిపాలిటీ ఇంచార్జ్ గా P. ఫయాజ్ బాషా ని నియమించారు.వార్డ్ 1 – మహమ్మద్ అలీ, వార్డ్ 5 – యునుస్, వార్డ్ 6 – అసిఫ్, వార్డ్ 7 – జమీర్ లాల్, వార్డ్ 8 – హబీబుల్లా, వార్డ్ 9 – సిద్దిక్, వార్డ్ 10 – అబ్దుల్ ఖాదర్, వార్డ్ 11 – ఖాదర్ బాషా, వార్డ్ 15 – యూసుఫ్, వార్డ్ 16 – ఏజాజ్, వార్డ్ 23 – ముబారక్ హాఫిజ్ సాబ్, వార్డ్ 24 – కుల్సుమ్ బీ వార్డు ఇంచార్జ్ లుగా నియమించడం జరిగింది.రిజర్వేషన్లు వచ్చిన తర్వాత రెండో విడత, మూడో విడతలో మిగిలిన వార్డుల అభ్యర్థులను ప్రకటిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పుంగనూరు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Tags:SDPI Joint District Meeting