October 10, 2026
Explore
మదనపల్లె డీఎంహెచ్‌వోగా డాక్టర్ ఉషశ్రీ బాధ్యతల స్వీకరణ

మదనపల్లె డీఎంహెచ్‌వోగా డాక్టర్ ఉషశ్రీ బాధ్యతల స్వీకరణ

October 10, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

అన్నమయ్య జిల్లా మదనపల్లె జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి (డీఎంహెచ్‌వో)గా డాక్టర్ ఉషశ్రీ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇప్పటివరకు అన్నమయ్య జిల్లా డీఎంహెచ్‌వోగా పనిచేస్తున్న డాక్టర్ లక్ష్మీనరసయ్య సస్పెండ్ కావడంతో ఆయన స్థానంలో డాక్టర్ శ్రీనివాసులు తాత్కాలికంగా బాధ్యతలు నిర్వహించారు. తాజాగా ఆయన స్థానంలో డాక్టర్ ఉషశ్రీకి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఆమె శనివారం బాధ్యతలు చేపట్టారు.

Tags; Dr. Ushasree assumes charge as Madanapalle DMHO.