October 10, 2026
Explore
12, 13 న పెద్దిరెడ్డి వార్డు సమావేశాలు

12, 13 న పెద్దిరెడ్డి వార్డు సమావేశాలు

October 10, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

వైఎస్సార్‌సిపి రీజనల్‌ కోఆర్డినేటర్‌ , ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈనెల 12, 13 తేదీలలో రెండు రోజుల పాటు మున్సిపాలిటి వార్డులలో సమావేశాలు నిర్వహిస్తారని మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా శనివారం రాత్రి విలేకరులకు తెలిపారు. మున్సిపల్‌ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రజలను చైతన్యపరిచేందుకు వార్డు సమావేశాలను పెద్దిరెడ్డి ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా 12న ఉదయం 9 గంటలకు హనుమంతరాయునిదిన్నె లో గల ఫ్రెండ్స్ కళ్యాణ మండపంలో సమావేశం నిర్వహిస్తారు. 11 గంటలకు మొదలియార్ల ఫంక్షన్‌హాల్‌లో సమావేశం నిర్వహిస్తారు. 12:30 గంటలకు నక్కబండలో సమావేశం జరుగుతుంది. 2:30 గంటలకు అంజుమన్‌ షాదీమహాల్‌లో , 3:30 గంటలకు రహమత్‌ నగర్‌లోని టిప్పుసర్కిల్‌లో సమావేశం జరుగుతుంది. అలాగే 13న ఉదయం జెఎండి ఫంక్షన్‌హాల్‌, 10:30 గంటలకు గాండ్ల ఫంక్షన్‌హాల్‌లో సమావేశం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ సమావేశాలను జయప్రదం చేసేందుకు వైఎస్సార్‌సిపి పార్టీ అభిమానులు, పెద్దిరెడ్డి అభిమానులు, ఆయా వార్డు మెంబర్లు, కార్యకర్తలు , మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని పెద్దిరెడ్డి సభలను జయప్రదం చేయాలని కోరారు.

Tags; Peddireddy’s ward meetings on the 12th and 13th