పుంగనూరుముచ్చట్లు:
భావితరాల మనుగడ కోసం ప్రతి ఒక్కరు విరివిగా మొక్కలు నాటాలని బిజెపి నియోజకవర్గ నాయకుడు నానబాలకుమార్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ప్రతి ఇంట్లో మొక్కలు పెంచుకోవాలని, కాలుష్యాన్ని నివారించాలని , ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నరసింహులు తదితరులు పాల్గొన్నారు.
Tags: BJP leaders planted saplings.