October 10, 2026
Explore
స్థానిక ఎన్నికలపై నిఘా

స్థానిక ఎన్నికలపై నిఘా

October 10, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో ఎస్పీ ధీరజ్‌కునుబిల్లి ఆదేశాలతో సీఐ సుబ్బరాయుడు , మున్సిపల్‌ కమిషనర్‌ మధుసూదన్‌రెడ్డి లు కలసి శనివారం పోలింగ్‌ కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓటర్ల భద్రత, మౌలిక సదుపాయాలను పరిశీలించారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘించినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. ప్రజలు ప్రశాంత ఎన్నికలకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ అన్సర్‌బాషా, సిబ్బంది పాల్గొన్నారు.

Tags: Surveillance on local elections