October 10, 2026
Explore
11న ఉచిత కంటి వైద్యశిబిరం

11న ఉచిత కంటి వైద్యశిబిరం

October 10, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలోని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం బిఎంఎస్‌క్లబ్‌ ఆవరణంలో ఉచిత కంటి వైద్యశిబిరం నిర్వహిస్తున్నట్లు ప్రాజెక్టు మేనేజర్‌ డాక్టర్‌ పి.శివ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ ఉదయం 10 గంటలకు శిబిరం ప్రారంభమౌతుందన్నారు. కంటి సంబంధిత సమస్యలు ఉన్న వారికి ఉచితంగా పరీక్షలు చేసి, అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు కూడ ఉచితంగా చేయనున్నట్లు తెలిపారు. శిబిరానికి వచ్చే వారు ఆధార్‌కార్డు, ఆరోగ్యశ్రీకార్డు, మొబైల్‌ నెంబరు తీసుకురావాలని , ఈ అవకాశాన్ని పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Tags: Free Eye Camp on the 11th