హార్ట్ ఎటాక్.. ఎప్పుడు ,ఎవరికి,ఎలా వస్తుందో తెలియదు…చిన్నా, పెద్ద,ఆడ, మగ అని తేడా లేదు….కనురెప్ప మూసి..తెరిచే లోపే…సడెన్ డెత్..!
ఖమ్మం ముచ్చట్లు:
రఘునాథపాలెం బీసీ గురుకుల పాఠశాలలో విషాదం చోటుచేసుకుంది.
ఎనిమిదో తరగతి విద్యార్థి సాత్విక్ (14) బుధవారం ఉదయం రన్నింగ్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు.
తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు వెంటనే స్పందించి ఖమ్మం సర్వజన ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
గుండెపోటుతో మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు.
బాలుడి మృతిపై బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Tags: 8th-grade student collapses and dies while playing