September 9, 2026
Explore
కోడి పందెం ఆడుతున్న 11 మందికి పది రోజులు జైలు శిక్ష

కోడి పందెం ఆడుతున్న 11 మందికి పది రోజులు జైలు శిక్ష

September 9, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

కోడి పందేలు ఆడుతూ పట్టుబడిన 11 మందికి 10 రోజుల జైలు శిక్ష విధిస్తూ మదనపల్లె స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు బుధవారం తీర్పు ఇచ్చింది. స్థానిక బొగ్గిటివారిపల్లె సమీపంలో జులై 28న కోడి పందేలు నిర్వహిస్తున్నారనే సమాచారంతో సీఐ కళా వెంకటరమణ దాడి చేసి 11 మందిని అదుపులోకి తీసుకుని రూ.16,500 నగదు, ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి జైలు శిక్ష విధించారు.

Tags: 11 people sentenced to ten days in jail for cockfighting.