September 8, 2026
Explore
అన్నమయ్య టీడీపీ జిల్లా ఇన్‌చార్జిగా కంచర్ల శ్రీకాంత్

అన్నమయ్య టీడీపీ జిల్లా ఇన్‌చార్జిగా కంచర్ల శ్రీకాంత్

September 8, 2026 | Andhra Pradesh

అన్నమయ్య ముచ్చట్లు:

అన్నమయ్య జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా ఇన్‌చార్జిగా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌ను నియమిస్తూ సోమవారం పార్టీ అధిష్ఠానం ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ అధిష్ఠానం జిల్లా ఇన్‌చార్జులను నియమిస్తోంది. జిల్లాలోని పార్టీ అంతర్గత విభేదాలు, అసంతృప్తులను పరిష్కరించి క్యాడర్‌ను ఎన్నికలకు సమాయత్తం చేయాల్సిన బాధ్యత ఇన్‌చార్జిపై ఉంది. రాయచోటి, తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు, పుంగనూరు నియోజకవర్గాల్లో పార్టీని సమన్వయం చేసి స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగాల్సి ఉంది.

Tags: Kancharla Srikanth appointed as Annamayya TDP District In-charge.