అన్నమయ్య ముచ్చట్లు:
రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1 నుంచి 4 వరకు జరిగిన 1వ ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్–2026లో అన్నమయ్య జిల్లా పోలీసులు సత్తా చాటారు. కర్నూలు రేంజ్ తరఫున పాల్గొని మొత్తం 21 పతకాలు సాధించారు. ఇందులో 7 స్వర్ణాలు, 8 రజతాలు, 6 కాంస్యాలు ఉన్నాయి. జిల్లా ఎస్పీ ధీరజ్ టెన్నిస్ డబుల్స్‌లో రన్నరప్‌గా నిలిచి రజత పతకం సాధించారు. మహిళా విభాగంలో WPC పి.శశికళ ఏడు పతకాలు సాధించారు. పతక విజేతలను ఎస్పీ అభినందించి సత్కరించారు. క్రీడలు పోలీసుల ఒత్తిడిని తగ్గించి మానసిక ప్రశాంతత, శారీరక దృఢత్వాన్ని అందిస్తాయని ఎస్పీ పేర్కొన్నారు.
Tags: Annamayya District Police Bag a Haul of Medals at State Police Sports Meet