September 8, 2026
Explore
స్థానిక ఎన్నికల నేపథ్యంలో పోలీసులకు సీఐ దిశానిర్దేశం

స్థానిక ఎన్నికల నేపథ్యంలో పోలీసులకు సీఐ దిశానిర్దేశం

September 8, 2026 | Andhra Pradesh

వాయల్పాడు ముచ్చట్లు:

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వాయల్పాడు సీఐ బి.రాఘవ రెడ్డి సర్కిల్ పోలీసు సిబ్బందితో సమావేశం నిర్వహించారు.

శాంతిభద్రతలకు ప్రాధాన్యత ఇవ్వాలని, సమస్యాత్మక ప్రాంతాలు, సున్నితమైన పోలింగ్ కేంద్రాలపై నిరంతర నిఘా ఉంచాలని సూచించారు. రౌడీషీటర్లు, అనుమానితులపై ముందస్తు చర్యలు, కౌన్సెలింగ్, బైండోవర్ చేపట్టాలన్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా గస్తీ, వాహన తనిఖీలు, ఫ్లాగ్ మార్చ్ లు నిర్వహించి ప్రజలు భయం లేకుండా ఓటేసే వాతావరణం కల్పించాలని ఆదేశించారు. సమావేశంలో ఎస్ఐలు తిప్పేస్వామి, రవీంద్రబాబు పాల్గొన్నారు.

Tags: CI issues guidelines to police in view of local elections.