అమరావతిముచ్చట్లు:
ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి ఇంట పెళ్లి సందడి మొదలుకానుంది. తన కుమార్తె అంజలి రెడ్డి పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయినట్లు షర్మిల ఎక్స్ వేదికగా ప్రకటించారు. అమెరికాకు చెందిన ప్రముఖ వైద్యులు డా. సోమాల రఘురాం రెడ్డికి తన కుమార్తెను ఇచ్చి వివాహం జరిపిస్తున్న షర్మిల తెలిపారు. కర్నూలు జిల్లాలకు చెందిన సోమాల సుబ్బారెడ్డి, పద్మ దంపతుల కుమారుడు డాక్టర్ రఘురాం రెడ్డి కాగా, వీరి కుటుంబం అమెరికాలో స్థిరపడింది. ఎక్స్ వేదికగా అంజలి- రఘురాం రెడ్డి వివాహ మహోత్సవ వేడుకను షర్మిల రెడ్డి ప్రకటించారు.
వైఎస్ షర్మిల కుమార్తె వైఎస్ అంజలి రెడ్డి అమెరికాలో ఉన్నత విద్యను పూర్తి చేశారు. ఆమె ప్రస్తుతం యూఎస్‌లో ఫైనాన్స్ సెక్టార్‌లో పనిచేస్తున్నారు. అంజలి అమెరికాలోని యూనివర్సిటీ నుంచి బీబీఏ డిగ్రీని పూర్తి చేశారు. ప్రస్తుతం గ్రాడ్యుయేషన్ పూర్తైన తర్వాత, అమెరికాలోనే ఫైనాన్షియల్ అనలిస్ట్‌గా ఉద్యోగం చేస్తున్నారు. షర్మిల, అనిల్ కుమార్‌లకు కాబోయే అల్లుడు సోమల రఘురామరెడ్డి విషయానికి వస్తే ఆయన కూడా యూఎస్‌లోని యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్‌లో మెడిసిన్ చదివారు. టెన్నెస్సీలోని నాష్‌విల్‌లో ప్రస్తుతం డాక్టర్‌గా పనిచేస్తున్నారు.
Tags: YS Sharmila’s daughter’s wedding fixed… Who is the groom?