రాయచోటి ముచ్చట్లు:
రాయచోటి పట్టణంలో వినాయక మండపాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు ముందుగా సంబంధిత శాఖల నుంచి అనుమతులు పొందాలని అర్బన్ సీఐ బి.వి. చలపతి సూచించారు. విద్యుత్ శాఖ, ఫైర్ డిపార్ట్‌మెంట్, మైక్/లౌడ్‌స్పీకర్ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు. అనుమతులు లేకుండా మండపాలు ఏర్పాటు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
శాంతిభద్రతలకు, ట్రాఫిక్‌కు, ప్రజలకు ఇబ్బంది కలగకుండా వినాయక చవితి వేడుకలను ప్రశాంతంగా నిర్వహించాలని కోరారు.
Tags: Prior permission is mandatory for Vinayaka pandals.