September 7, 2026
Explore
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులలో సకాలంలో న్యాయం చేయాలి

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులలో సకాలంలో న్యాయం చేయాలి

September 7, 2026 | Andhra Pradesh

అన్నమయ్య జిల్లా ముచ్చట్లు:

అన్నమయ్య జిల్లాలో నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను ఎలాంటి పక్షపాతం, జాప్యం లేకుండా సత్వరమే పరిష్కరించి బాధితులకు సకాలంలో న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ ధీరజ్ స్పష్టం చేశారు.

స్థానిక కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా నిఘా, పర్యవేక్షణ కమిటీ సమావేశంలో వారు మాట్లాడుతూ, సంఘటన జరిగిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి బాధితులకు ప్రభుత్వ పరిహారం అందేలా చూడాలని, సకాలంలో ఛార్జిషీట్లు దాఖలు చేయాలని అధికారులను ఆదేశించారు.

అణగారిన వర్గాల రక్షణ కోసం ప్రతి నెలా విధిగా ‘సివిల్ రైట్స్ డే’ నిర్వహించాలని, అలాగే సభ్యులు ప్రస్తావించిన ఎస్సీ, ఎస్టీ స్మశాన వాటికల దారి సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి, పోలీసు మరియు ఇతర శాఖల అధికారులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Tags: Justice must be delivered in a timely manner in SC/ST atrocity cases.