March 27, 2026
Explore
వైభవంగా శ్రీరామనవమి ఉత్సవాలు

వైభవంగా శ్రీరామనవమి ఉత్సవాలు

March 27, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

శ్రీరామనవమి పండుగ సందర్భంగా వివిధ రామాలయాలు, ఆంజనేయస్వామి ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం పట్టణంలోని హనుమంతురాయునిదిన్నెలో గల శ్రీఆంజనేయస్వామి, సుబ్బమ్మ చెరువు వద్ద గల శ్రీఆంజనేయస్వామికి, కట్టక్రిందపాళ్యెంలో గల శ్రీకోదండరామస్వామికి , మార్లపల్లెలో గల శ్రీఅభయాంజనేయస్వామికి, అరవపల్లె వద్ద గల శ్రీవీరాంజనేయస్వామికి, హైస్కూల్‌వీధిలో గల కోదండరామస్వామి ఆలయాలలో పూజలు నిర్వహించారు. వేకువజాము నుంచి హ్గమాలు, అభిషేకాలు నిర్వహించి, భక్తులకు పెసరపప్పు, బెల్లంపానకం, మజ్జిగ పంపిణీ చేశారు. కొన్ని ఆలయాలలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాలలో రామకోటి నిర్వహించారు. భక్తుల రామనామస్మరణతో ఆప్రాంతాలు భక్తిపారవశ్యమైంది.

Tags: Sri Rama Navami Celebrations Held with Great Grandeur