పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని సంతగేటు వద్ద ట్రాన్స్ఫార్మర్ పైకి ఎక్కిన మేకపిల్ల విద్యుత్‌షాక్‌తో మృతి చెందింది. గురువారం ఆప్రాంతంలో మేతకు వెళ్లిన మేకపిల్ల ట్రాన్స్ఫార్మర్ వద్ద ఉన్న గడ్డితినేందుకు వెళ్లి షాక్‌కు గురైంది. వెంటనే ట్రాన్స్ఫార్మర్‌లో మంటలు, పోగలు వచ్చి మేకపిల్ల అక్కడిక్కడే మృతి చెందింది. విద్యుత్ అధికారులు ట్రాన్స్ఫార్మర్లకు కంచెలు ఏర్పాటు చేసి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, లేకపోతే ప్రమాదాలు తీవ్రమౌతుందని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Tags: Kid Goat Dies from Electric Shock