అమరావతి ముచ్చట్లు:
అమరావతిలోని ఓ యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్న తమ కుమార్తెను ఆనంద్ అక్రమంగా నిర్బంధించాడని తల్లిదండ్రులు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణలో, యువతి తనను ఎవరూ నిర్బంధించలేదని, ఇష్టపూర్వకంగానే ఆనంద్ను వివాహం చేసుకున్నానని స్పష్టం చేసింది. తల్లిదండ్రులతో వెళ్లేందుకు నిరాకరించి, భర్తతోనే ఉంటానని తేల్చిచెప్పింది. యువతిమేజర్ కావడంతో, హైకోర్టు ధర్మాసనం హెబియస్ కార్పస్ పిటిషనను కొట్టివేసింది.
Tags:B.Tech Student’s Love Marriage: Dispute Reaches High Court