ఆంధ్రప్రదేశ్ ముచ్చట్లు:
విశాఖపట్నం జిల్లా గుడిలోవలో నేటి నుంచి ఆర్‌ఎస్‌ఎస్ అఖిల భారత సమన్వయ బైఠక్ ప్రారంభం కానుంది. ఈ నెల 21వ తేదీ వరకు కొనసాగే ఈ అత్యున్నత స్థాయి సమావేశాలకు ఆర్‌ఎస్‌ఎస్ సరసంఘచాలక్ మోహన్ భగవత్, దత్తాత్రేయ హోసబలే సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ బైఠక్‌లో 32 అనుబంధ సంస్థల కార్యక్రమాలతో పాటు ‘పంచ పరివర్తన్’ అమలు, సామాజిక సమరసత, జాతీయ భద్రతా అంశాలపై కీలక సమీక్ష నిర్వహించి భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేయనున్నారు.
Tags;RSS All-India Coordination Meeting Begins Today