అమరావతిముచ్చట్లు:
NEET-UG ప్రశ్నపత్రం లీకేజీ, UGC-NET పరీక్షల్లో లోపాలపై విమర్శలు ఎదుర్కొంటున్న NTAలో కేంద్ర విద్యాశాఖ భారీ సంస్కరణలు చేపట్టింది. డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ చర్యలను మంత్రిత్వశాఖకు వివరించారు. పరీక్షల బృందాన్ని పునర్వ్యవస్థీకరించి, 600 మంది నిపుణులను తొలగించి, కొత్తవారిని నియమించనున్నారు. ప్రశ్నపత్రాల్లో లోపాలు లేకుండా నాలుగు అంచెల తనిఖీ వ్యవస్థను ప్రవేశపెట్టనున్నారు. రాబోయే 2-3 వారాల్లో 20-25 మంది అధికారులను నియమించడంతో పాటు, NTA కార్యాలయాలను కొత్త భవనాలకు తరలించి, CISF భద్రతను కట్టుదిట్టం చేయనున్నారు.
Tags: 600 employees laid off at NTA!