ఆంధ్రప్రదేశ్ ముచ్చట్లు:
రాష్ట్రంలో దివ్యాంగులకు శుభవార్త. ఇకపై సచివాలయాల చుట్టూ తిరిగే పనిలేకుండా, నేరుగా మొబైల్ నుంచే SADAREM స్లాట్ బుకింగ్ & సర్టిఫికెట్ డౌన్‌లోడ్ చేసుకునే కొత్త విధానం ప్రారంభమైంది. WhatsApp eGovernance ద్వారా లైవ్ స్లాట్ అవైలబిలిటీ చెక్ చేసి ఆధార్ OTP తో నేరుగా మొబైల్‌లోనే స్లాట్ బుక్ చేసుకోవచ్చు. అసెస్‌మెంట్ పూర్తయ్యాక డిజిటల్ సర్టిఫికెట్ వెంటనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీనికి ఆధార్ కార్డ్, ఫోటోలు, మునుపటి మెడికల్ రిపోర్ట్స్ ఉంటే చాలు. ఈ సేవ ఉచితం, ఎవరికీ రుసుము ఇవ్వాల్సిన అవసరం లేదు.
Tags: Book Sadaram slots directly from your mobile from now on.