August 19, 2026
Explore
ఉదయ్ కృష్ణారెడ్డికి డీఎన్‌ఏ టెస్టులు!

ఉదయ్ కృష్ణారెడ్డికి డీఎన్‌ఏ టెస్టులు!

August 19, 2026 | Andhra Pradesh

తెలంగాణ ముచ్చట్లు:

అత్యాచారం, హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఉదయ్ కృష్ణారెడ్డికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించేందుకు కోర్టు అనుమతి మంజూరు చేసింది. బాధితురాలి గాయాలు, దుస్తులపై లభించిన ఆధారాలతో నిందితుడి బ్లడ్ శాంపిళ్లను పోల్చనున్నారు. పోలీసు కస్టడీ గడువు బుధవారంతో ముగియనున్న నేపథ్యంలో, పోలీసులు కీలక ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. సూసైడ్ నోట్, ఐఫోన్, రహస్య వీడియోలు ఎక్కడున్నాయనే ప్రశ్నలకు ఉదయ్ కృష్ణారెడ్డి ‘నాకు తెలియదు’ అని సమాధానమిచ్చినట్లు సమాచారం.

Tags: DNA tests for Uday Krishna Reddy!