అమరావతిముచ్చట్లు:
వారిలో ఆడపిల్లలు ఎంతమంది, మగపిల్లలు ఎంతమంది ఉన్నారో చెప్పాలంది. ఎంతమంది ఆచూకీ లభ్యమైంది, ఎంతమంది సమాచారం లభ్యం కాలేదో సవివరంగా చెప్పాలని స్పష్టం చేసింది.
కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్ అగ్రహారానికి చెందిన రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి ఆచూకీని కనుగొనేందుకు చేస్తున్న ప్రయత్నాలపై పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. పాప ఆచూకీ గుర్తించేందుకు ప్రయత్నిస్తుండాలని చెప్పింది.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్ తో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది.
జ్ఞానేశ్వరి ఆచూకీని గుర్తించడంలో పోలీసులు, అధికారులు విఫలమయ్యారంటూ న్యాయవాది జి.శ్రీకాంత్ హైకోర్టులో పిల్ వేసిన విషయం తెలిసిందే. దీనిపై మంగళవారం జరిగిన విచారణలో పోలీసుల తరఫున ప్రభుత్వ న్యాయవాది జయంతి వాదించారు. చిన్నారిని కనుగొనేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు తీసుకున్న చర్యల వివరాలను కోర్టు ముందు ఉంచామన్నారు.
Tags: The High Court has directed the Andhra Pradesh government to provide details of children who went missing across the state last year.