తాడేపల్లి ముచ్చట్లు:
శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన తూమాటి..
వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ను ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు కలిశారు..
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ పదవికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా తూమాటి మాధవరావు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు.
శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ అభ్యర్థిగా తూమాటి మాధవరావు పేరును వైయస్ జగన్ ఇప్పటికే ప్రకటించించారు.
పార్టీ ఎమ్మెల్సీలంతా సమన్వయంతో పనిచేసి ఆయన ఎన్నిక సాఫీగా జరిగేలా పూర్తి మద్దతు ఇవ్వాలని కూడా వైయస్ జగన్ సూచించారు.
శాసనమండలిలో అసెంబ్లీ కార్యదర్శికి వైసీపీ ఎమ్మెల్సీలు తూమాటి మాధవరావు నామినేషన్ పత్రాలను అందచేశారు.
Tags; Thumati Madhava Rao met YS Jagan.