August 19, 2026
Explore
తవ్వకాలలో రాగి నాణేలు లభ్యం,..!!

తవ్వకాలలో రాగి నాణేలు లభ్యం,..!!

August 19, 2026 | Andhra Pradesh

కడప ముచ్చట్లు:

వైఎస్ఆర్ కడప జిల్లా సిద్ధవటం లోని పెన్నా నది తీర ప్రాంతమున వెలసిన సిద్ధవటేశ్వర శివాలయంలో ధ్వజస్తంభం, తొలగింపు పనుల్లో భాగంగా రెండవ రోజు మంగళవారం కూలీలచే తవ్వకాలు చేపడుతుండగా మరో కొన్ని పురాతనమైన రాగి నాణేలు బయటపడ్డాయి ఈ సందర్భంగా శ్రీశైల దేవస్థానం ఏఈఈ రమేష్ మాట్లాడుతూ ధ్వజస్తంభం నూతనంగా ఏర్పాటు చేయడం కొరకు రెండో రోజు తవ్వకాలు చేపడుతుండగా కొన్ని రాగి నాణేలు బయటపడ్డాయని శ్రీశైల దేవస్థానం ట్రస్టుకు అప్పగిస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి ప్రవీణ్ శర్మ స్థానిక పోలీసులు గ్రామస్తులు పాల్గొన్నారు..

Tags: Copper coins found during excavations…!!