రాయచోటి ముచ్చట్లు:
రాయచోటి నియోజకవర్గ పరిధిలో హంద్రీనీవా కాలువ పనులకు సుమారు రూ.350 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్న నేపథ్యంలో టీడీపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. 490 నుంచి 535 కిలోమీటర్ల పరిధిలో చేపట్టే పనులతో సుమారు 25 వేల ఎకరాల పరిధిలోని చెరువులకు హంద్రీనీవా నీటిని అందించేందుకు మార్గం సుగమం కానుందని తెలిపారు.హంద్రీనీవా సుజల స్రవంతి ఫేజ్-2లో భాగంగా మెయిన్ కెనాల్ మిగిలిన పనులు, అవసరమైన ప్రాంతాల్లో సీసీ లైనింగ్, బ్రాంచ్ కెనాల్ పనులకు రూ.1,323.75 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరు చేయడాన్ని స్వాగతించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ, మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి కృషితో రాయలసీమ సాగు, తాగునీటి భద్రత మరింత బలోపేతం కానుందని నాయకులు పేర్కొన్నారు. రామాపురం మండలం నీలకంఠరావుపేటలో సీఎం చంద్రబాబు, మంత్రి రాంప్రసాద్‌రెడ్డి చిత్రపటాలకు టీడీపీ నాయకులు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు.
Tags: Rs. 350 crore for Handri-Neeva works… TDP leaders express happiness.