August 19, 2026
Explore
ప్రియుడి మోజులో పడి.. భర్తని,నవ మాసాలు మోసిన కొడుకుని ఏ మాత్రం జాలి లేకుండా చంపిన భార్య

ప్రియుడి మోజులో పడి.. భర్తని,నవ మాసాలు మోసిన కొడుకుని ఏ మాత్రం జాలి లేకుండా చంపిన భార్య

August 19, 2026 | Andhra Pradesh

ఎంత మంది అమాయకులు బలి అయ్యారో ఇప్పటికీ…!..చంప కుండా.. విడాకులు తీసుకుంటే సరిపోయిద్ది…అంతే కానీ ఘోరం గా చంపి వారి జీవితం ని కూడా నాశనం చేసుకున్న స్థితి!

షోషల్ మీడియా(ఇన్స్టాగ్రామ్, స్నాప్ చాట్,ఫేస్ బుక్ ) లతో వివాహేతర సంబంధం ఏర్పడుతున్నాయి…బెట్టర్ వాటికి దూరం గా ఉండడం…ఉంచడం

బెంగుళూరు ముచ్చట్లు:

అభినందన్, హరిణికి 2021లో పెళ్లి జరిగింది. వీరికి ఓ కొడుకు ఉన్నాడు. అయితే 2024 లో హరిణికి స్నాప్‌ చాట్ ద్వారా వినయ్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. అది కాస్త ప్రేమగా మారడంతో.. వినయ్‌ తో హరిణి వివాహేతర సంబంధం కొనసాగించింది. అయితే ఇదే విషయంపై భార్యాభర్తలైన హరిణి, అభినందన్ మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో హరిణి ఎఫైర్‌ ను బయటపెట్టేందుకు.. ఆమె కాల్ డేటా రికార్డ్ కోసం భర్త పోలీసుల్ని ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలోనే తన ఎఫైర్‌ కు అడ్డుగా ఉన్న భర్తను చంపాలని వినయ్‌ తో కలిసి హరిణి ప్లాన్ వేసింది.

అలా ఇటీవల ఆదివారం అర్థరాత్రి 12:30 గంటలకు.. అభినందన్ గదిలోకి వెళ్లారు వినయ్, హరిణి. అభినందన్ కాళ్లను హరిణి పట్టుకోగా.. గొంతు నులిమి వినయ్ అతడ్ని చంపేశాడు. అయితే శబ్దాలు రావడంతో.. కుమారుడు నిద్ర లేచి, ఈ ఉదంతం మొత్తం చూశాడు. దీంతో.. తమ బండారం బయటపడుతుందని, అతడ్ని కూడా చంపేశారు రాక్షసులు. ఆపై తన భర్తతో పాటు కొడుకు స్పందించడం లేదని హరిణి డ్రామాలు ఆడింది. వాళ్లు ఎలా చనిపోయారని కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా అసలు నిజం బయటపడింది. వివాహేతర సంబంధం కోసం హరిణి తన ప్రియుడు వినయ్‌ తో కలిసి చంపిందని గుర్తించారు. దాంతో హరిణితో పాటు ఆమె ప్రియుడు వినయ్‌ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Tags: A wife, infatuated with her lover, killed her husband and the son she had carried for nine months without a shred of pity.