March 8, 2026
Explore
మహిళా దినోత్సవం సందర్భంగా “తేజోవతి” కి ఘన సన్మానం

మహిళా దినోత్సవం సందర్భంగా “తేజోవతి” కి ఘన సన్మానం

March 8, 2026 | Andhra Pradesh

శ్రీకాళహస్తీ ముచ్చట్లు:

దేశాభివృద్ధిలో స్త్రీల శక్తీ హర్షణీయం…ప్రతి ఒక్కరు మహిళలోకాన్ని గౌరవించండి

మేళాగారం సుబ్రమణ్యం రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు

  అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వన్నెకుల క్షత్రియ అభివృద్ధి కమిటీ రాష్ట్ర డైరెక్టరు, బీజేపీ నాయకురాలు   జీపాలెం తేజోవతిని ఘనంగా సన్మానించారు. వన్నెకుల క్షత్రియ సంఘం నాయకులు మేళాగారం సుబ్రమణ్యం రెడ్డి, పూజారి ప్రేమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సభ ప్రాంగణంలో శ్రీకాళహస్తీశ్వరా స్వామీవారి దేవస్థాన శేషవస్త్రం కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా మేళాగారం సుబ్రమణ్యం రెడ్డి మాట్లాడుతూ  "కుటుంబానికి ఆధారం, సమాజానికి స్పూర్తిగా నిలుస్తున్న మహిళల శక్తీ, సహనం, ప్రేమ, మహిళల త్యాగం"  అపూర్వమైనది. ఓర్పులో, నేర్పులో, తనకు తానే సాటి. స్త్రీ శక్తీ... భూదేవి అంత సహనం... రుద్రమ దేవి అంత పరాక్రమం... సీతాదేవి అంత సౌశీల్యం ఉన్న నేటి మేటి మహిళాలోకానికి మేళాగారం సుబ్రమణ్యం రెడ్డి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు పేరుపేరునా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా మహిళాభివృద్ధి కోసం అనేక   సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జీపాలెం తేజోవతి, చిన్నా రెడ్డి, మేళాగారం సుబ్రమణ్యం రెడ్డి, పూజారి ప్రేమ్ కుమార్ రెడ్డి, మునికృష్ణా రెడ్డి, చెంబేడు జయశంకర్ రెడ్డి, పరుకూరు మునిబాబు, పైమాల గెరటరెడ్డి, కారూరు జనార్దన్ రెడ్డి, కరుణకర్ రెడ్డి, కండ్రిగ యాతీంద్ర రెడ్డి, రమణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags: A grand tribute to “Tejovathi” on the occasion of Women’s Day