March 25, 2026
Explore
ఎర్రచందనం స్మగ్లర్‌కు జైలు శిక్ష జరిమానా విధింపు.

ఎర్రచందనం స్మగ్లర్‌కు జైలు శిక్ష జరిమానా విధింపు.

March 25, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

  • ఆర్ఎస్ఎస్ ఏడీజే కోర్టు కీలక తీర్పు.
  • ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన స్మగ్లర్‌కు జైలు శిక్ష మరియు జరిమానా విధిస్తూ ఆర్ఎస్ఎస్ ఏడీజే కోర్టు న్యాయమూర్తి ఏ. నరసింహమూర్తి బుధవారం తీర్పు ప్రకటించారు.
  • తిరుపతి జిల్లా శేషాచలం రిజర్వు అటవీ ప్రాంతంలో జరుగుతున్న ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు తిరుపతి జిల్లా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, పర్యవేక్షణలో అమలు చేస్తున్న ‘గుడ్ ట్రయల్ మానిటరింగ్’ వ్యవస్థ ఫలితంగా ఈ కేసులో న్యాయం సాధ్యమైంది.
  • కేసు వివరాలు.
  • ముద్దాయి ఉటుకూరి చెంగల్ రెడ్డి (56 సంవత్సరాలు), తండ్రి వి. నారాయణ రెడ్డి, యనమలవారిపల్లి గ్రామం, కమల్ల పంచాయితీ, యర్రావారిపాలెం మండలం, తిరుపతి జిల్లా. 2015 సంవత్సరంలో భాకరాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో, నిందితులు ఉటుకూరి చెంగల్ రెడ్డి మరియు తిమ్మసముద్రం వెంకట్ రెడ్డి ఇద్దరూ శేషాచలం రిజర్వు అటవీ ప్రాంతంలో అక్రమంగా ప్రవేశించి, అతి విలువైన ఎర్రచందనం చెట్లను నరికి అక్రమ రవాణా చేస్తుండగా అప్పటి ఎస్ఐ నెట్టికంటయ్య అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.
  • కోర్టు తీర్పు.
  • నిందితుడు ఉటుకూరి చెంగల్ రెడ్డి పై నేరం రుజువు కావడంతో, న్యాయమూర్తి:
  • 2 సంవత్సరాల కారాగార శిక్ష రూ. 20,000/- జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా 3 నెలల జైలు శిక్ష విధించారు.
  • జిల్లా ఎస్పీ హెచ్చరిక.
  • కోర్టు తీర్పు చట్టాన్ని ఉల్లంఘించే వారికి గుణపాఠం. జిల్లాలో అడవుల సంపదను కాపాడటానికి పోలీసులు గట్టి చర్యలు తీసుకుంటున్నారు .అలాగే ఎర్రచందనం అక్రమ రవాణాపై కఠినంగా చర్యలు కొనసాగుతుందని అన్నారు.
  • ఈ కేసు విచారణ, పర్యవేక్షణ, కోర్టు లైజనింగ్‌లో విశేష కృషి చేసిన బేతపూడి ప్రసాద్, డీఎస్పీ, చంద్రగిరి ఏ. అమరనారాయణ, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, డి. నెట్టికంటయ్య, అప్పటి ఎస్ఐ (దర్యాప్తు అధికారి) టి.వి. సత్యనారాయణ, సీఐ, భాకరాపేట బి. కృష్ణయ్య,ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ హరినాథ్ (కోర్టు లైజనింగ్) హెడ్ కానిస్టేబుల్ ఆర్. నరసింహులు. వారిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. వీరి సమష్టి కృషే ఈ విజయానికి కారణం అని ఎస్పీ పేర్కొన్నారు.

Tags: Red Sandalwood Smuggler Sentenced to Jail and Fined.