March 24, 2026
Explore
ఏపీలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్ బదిలీలు!

ఏపీలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్ బదిలీలు!

March 24, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగంలో భారీ మార్పులకు కసరత్తు పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం నేడు లేదా రేపు ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. ఈ బదిలీల్లో భాగంగా కీలక జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో పాటు సచివాలయంలోని వివిధ శాఖల కార్యదర్శులను కూడా మార్చనున్నట్లు సమాచారం. పరిపాలనలో వేగాన్ని పెంచేందుకు, ప్రాధాన్యత కలిగిన పోస్టుల్లో సమర్థులైన అధికారులను నియమించాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Tags: Massive Transfers of IAS and IPS Officers in AP!