March 23, 2026
Explore
హుండీలో భక్తి పేరుతో… నకిలీ నోట్ల కలకలం!

హుండీలో భక్తి పేరుతో… నకిలీ నోట్ల కలకలం!

March 23, 2026 | Andhra Pradesh

హైదరాబాద్ ముచ్చట్లు:

కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయం హుండీ లెక్కింపులో ఆశ్చర్యకర ఘటన వెలుగులోకి వచ్చింది.

భక్తులు సమర్పించిన నగదు మధ్య డూప్లికేట్ నోట్లు బయటపడటం కలకలం రేపింది.

100, 200, 500 రూపాయల “Childrens Bank” పేరుతో ఉన్న నకిలీ నోట్లు అసలు కరెన్సీతో కలిపి హుండీలో వేయబడినట్లు గుర్తించారు.

ఈ ఘటనపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పవిత్ర స్థలాల్లో కూడా ఇలాంటి చర్యలు జరగడం బాధాకరమని అంటున్నారు.

దీనిపై ఆలయ అధికారులు స్పందించి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు.

Tags: Fake Currency Scare in Temple Donation Box—In the Name of Devotion!