జమ్మూకశ్మీర్ ముచ్చట్లు:
జమ్మూకశ్మీర్ లోని ప్రసిద్ధ అమర్నాథ్ యాత్ర మొదలైంది.ఈ ఆధ్యాత్మిక యాత్ర ఈ రోజు జూలై 3న ప్రారంభమై.. ఆగస్టు 28వ తేదీన రక్షాబంధన్తో ముగుస్తుంది. 57 రోజుల పాటు సాగే ఈ యాత్ర కోసం జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా మంచు లింగానికి తొలి పూజలు నిర్వహించి యాత్రను లాంఛనంగా ప్రారంభించారు. కఠినమైన వాతావరణం దృష్ట్యా వయస్సు, ఆరోగ్య నిబంధనలను బోర్డు ఖచ్చితంగా అమలు చేస్తోంది.
హిమలింగ దర్శనానికి 4 లక్షల మందికి పైగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
Tags: Amarnath Yatra Begins