July 2, 2026
Explore
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్

July 2, 2026 | Andhra Pradesh

తిరుమల ముచ్చట్లు:

తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. రైల్వే కోడూరు నియోజకవర్గంలో విబి జీ – రాం జీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం నేరుగా తిరుమల వెళ్లి స్వామి వారి సేవలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని శ్రీ రంగనాయకుల మండపంలో వేద పండితులు పవన్ కళ్యాణ్ కి ఆశీర్వచనం చేసి స్వామి వారి చిత్రపటంతోపాటు తీర్ధప్రసాదాలు అందజేశారు. దీక్షలో ఉన్న పవన్ కళ్యాణ్ అధికారిక కార్యక్రమం ముగిసిన అనంతరం శ్రీవారిని దర్శించుకోవాలని తలంచారు. ఇందులో భాగంగా సాయంత్రం దర్శనానికి వెళ్లారు. పవన్ కళ్యాణ్ తోపాటు తిరుపతి శాసన సభ్యులు ఆరణి శ్రీనివాసులు, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ ఛైర్మన్ కళ్యాణం శివశ్రీనివాస్, హస్తకళల నైపుణ్యాభివృద్ధి సంస్థ ఛైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణ తేజ శ్రీవారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.

Tags: Pawan Kalyan visits Lord Sri Venkateswara Swamy at Tirumala.