July 2, 2026
Explore
ఎస్‌ఐఆర్‌లో ఓట్లు నమోదుకు ఫీట్లు చేయాల్సి ఉంది

ఎస్‌ఐఆర్‌లో ఓట్లు నమోదుకు ఫీట్లు చేయాల్సి ఉంది

July 2, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

ఎస్‌ఐఆర్‌ (స్పెషల్‌ ఇన్‌టెన్సివ్‌ రివిజన్‌) కార్యక్రమంలో ఓట్లు పరిశీలన, నమోదుకు ఫీట్లు చేయాల్సిన అవసరం ఏర్పడిందని మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ అలీమ్‌బాషా అన్నారు. గురువారం పట్టణంలోని 54, 55 , 56 పోలీంగ్‌ కేంద్రాలలో బిఎల్‌వోలు, బిఎల్‌ఏలతో కలసి ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్‌ ఫారాలు పంపిణీ చేశారు. 2002 ఓటర్ల జాబితాను, ఓటరు ఎపిక్‌ కార్డును, ప్రస్తుత జాబితాలను పరిశీలించుకోవడం, జాబితాలో లేకపోతే కుటుంబ సభ్యులతో మ్యాపింగ్‌ చేయడం లాంటి కార్యక్రమాలతో ఎస్‌ఐఆర్‌లో యుద్ధం చేయాల్సి వస్తోందన్నారు. పార్టీ శ్రేణులు ఇంటింటికి వెళ్లి జాగ్రత్తగా డిజిటల్‌ నమోదు చేపట్టాలన్నారు. ఒక్క ఓటు లేకున్న పార్టీ తీవ్రంగా నష్టపోతుందని తెలిపారు. అలాగే ఓటు లేకపోతే సంక్షేమ పథకాలు కూడ తొలగిస్తారన్నది ప్రచారం సాగుతోందని, ప్రభుత్వం ఇలాంటి కుంటిసాకులతో సంక్షేమ పథకాలకు ప్రజలను దూరం చేసే అవకాశం ఉందన్నారు. ప్రతి ఒక్కరు ఎస్‌ఐఆర్‌ను జయప్రదం చేసేందుకు ఐకమత్యంతో కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్థర్‌పాల్‌, బాషు, సురేంద్ర, అజీజ్‌ , లక్ష్మణరాజు, రమ్యకృష్ణ, అస్లాం, ప్రణీత్‌,బావాజాన్‌, సాహేబ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags: One has to go to great lengths to register votes in the SIR.