July 2, 2026
Explore
డెంగ్యూ పై సమరం

డెంగ్యూ పై సమరం

July 2, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో డెంగ్యూ జ్వరాలు తీవ్రమౌతోందని, దీని నివారణకు ప్రతి ఒక్కరు యుద్ధం చేయాల్సిన అవసరం ఉందని అర్భన్‌ పిహెచ్‌సి యూనిట్‌ అధికారి గంగయ్య తెలిపారు. గురువారం పట్టణంలోని కొత్తపేట పిహెచ్‌సిలో డెంగ్యూ మాసోత్సవాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ దోమ కుట్టిన నాలుగు రోజుల నుంచి పదిరోజులలోపు తీవ్రమైన జ్వరము, కళ్ళు, కీళ్ళు నొప్పులు తీవ్రమౌతుందన్నారు. వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. నీటి నిల్వలు లేకుండ నీటిని కాచి, వడపోసి తాగాలని సూచించారు. అలాగే దోమ కాటుకు గురికాకుండ దోమతెరలు వినియోగించడం, ఫాగింగ్‌ చేయాలని సూచించారు. ఈ మేరకు కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ ర్యాలీలో హెల్త్ అసిస్టెంట్‌ తేజోమూర్తి, ఆశకార్యకర్త పుష్ప, యామిని తదితరులు పాల్గొన్నారు.

Tags: The fight against dengue