ముంబయి ముచ్చట్లు:
దేశ ఆర్థిక రాజధాని ముంబయిని వరసగా రెండోరోజూ భారీ వర్షం ముంచెత్తింది. 24 గంటల్లో నగరంలోని పలుచోట్ల 100 మిల్లీమీటర్ల కు పైగా వర్షపాతం నమోదైంది. ట్రాఫిక్ స్తంభించిపో యింది. మూడు విమానాలను దారి మళ్లించారు. పాల్హర్ ప్రాంతానికి రెడ్ అలర్ట్ జారీ అయింది. గురు వారం అక్కడి విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఠాణె, పాల్హర్, ముంబయి మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో విస్తారంగా కురిసిన వానల ధాటికి అనేక ప్రాంతాలు నీటమునిగాయి. మహారాష్ట్రలోని పలు ప్రాంతాలతో పాటు దక్షిణ బెంగాల్ లో భారీ వర్షాలు పడే అవకాశం
ఉందని వాతావరణ విభాగం తెలిపింది. కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ లలో వానల కారణంగా వేర్వేరు ఘట నల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు ఉత్తర్ ప్రదేశ్లో పిడుగుపాటుకు ప్రాణాలు కోల్పో యారు. ఎండలతో అల్లాడిపోతున్న పంజాబ్, హరి యాణాలకు వానలు కాస్త ఊరటనిచ్చాయి. ఉత్తరాఖం డ్ లో నైరుతి రుతుపవనాలు మరింత విస్తరించి వానలు కురుస్తుండటంతో దేహ్రాదూన్ సహా కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. హిమాచ ల్ ప్రదేశ్లోని మండీ జిల్లాలో భారీ వానలు కురుస్తు న్నాయి. శిమ్లా, మనాలీ, ధర్మశాల తదితర ప్రాంతాల్లో పలు రోడ్డుమార్గాలు మూసివేశారు. వానలతో అల్లాడి పోతున్న అరుణాచలప్రదేశ్ను అన్నివిధాలా ఆదుకుం టామని కేంద్రం హామీ ఇచ్చింది.
Tags: Rain inundates Mumbai; normal life disrupted in several parts of North India.