అమరావతిముచ్చట్లు:
ఏపీరాష్ట్రంలో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ఏపీ ప్రభుత్వం భూ కేటాయింపు విధానంలో కీలక మార్పులు చేసింది. 2024 జూలై 1 తర్వాత కేటాయించిన ప్రభుత్వ భూముల పై సంస్థలకు పూర్తి యాజమాన్య హక్కులు కల్పిస్తూ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. దీనివల్ల సంస్థలు ఆ భూములను విక్రయించుకునే లేదా లీజుకు ఇచ్చే వెసులుబాటు లభిస్తుంది. పర్యాటక, పారిశ్రామిక ప్రాజెక్టుల అమలును వేగవంతం చేయడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశ్యం.
Tags: AP Government’s Sensational Decision