రామాపురం ముచ్చట్లు:
రామాపురం మండలం నీలకంఠరావుపేట గ్రామ రైతు భరోసా కేంద్రంలో గురువారం VB-G RAM G పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గతంలో అమలులో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి బదులుగా కొత్త విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఉపాధి పనిదినాలను 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచడంతో పాటు, కూలీలకు 15 రోజుల్లోపు వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉపాధి కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గ్రామ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఉపాధి కార్మికులు పాల్గొన్నారు.
Tags: VB-G RAM G scheme launched in Neelakantharaopeta