July 2, 2026
Explore
వీరబల్లెలో గంగమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన

వీరబల్లెలో గంగమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన

July 2, 2026 | Andhra Pradesh

వీరబల్లె ముచ్చట్లు:

వీరబల్లె మండల కేంద్రంలోని చిన్న గంగమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణ నూతన శంకుస్థాపన కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. రాష్ట్ర ఎంపీపీల సంఘం ఉపాధ్యక్షులు, వీరబల్లె ఎంపీపీ గాలివీటి రాజేంద్రనాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఆలయ పునర్నిర్మాణానికి ప్రభుత్వం రూ.20 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా దాతలు ఉదారంగా విరాళాలు ప్రకటించగా, చిన్న గంగమ్మ తల్లితో పాటు పెద్ద గంగమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణానికి కూడా శ్రీకారం చుట్టారు.

Tags: Foundation stone laid for the reconstruction of the Gangamma Thalli temple in Veeraballe.