July 2, 2026
Explore
రైల్వేకోడూరుకు వరాల జల్లు.. సీఎం కీలక ప్రకటనలు

రైల్వేకోడూరుకు వరాల జల్లు.. సీఎం కీలక ప్రకటనలు

July 2, 2026 | Andhra Pradesh

రైల్వేకోడూరు ముచ్చట్లు:

ముక్కావారిపల్లె సభలో ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ప్రస్తావించిన రైల్వేకోడూరు నియోజకవర్గ అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, రైల్వేకోడూరు ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణానికి రూ.5–6 కోట్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులకు రూ.8 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే చిట్వేల్ మండలంలో APMDC ఆధ్వర్యంలో పిల్లల పాఠశాల ఏర్పాటుకు రూ.10 కోట్లు కేటాయిస్తామని తెలిపారు.

రైల్వేకోడూరు–వెంకటగిరి రహదారి నిర్మాణానికి అవసరమైన 22 కిలోమీటర్ల అటవీ అనుమతులు కూడా మంజూరు చేస్తామని సీఎం వెల్లడించారు. ఎమ్మెల్యే ప్రతిపాదించిన అన్ని అభివృద్ధి పనులకు ప్రభుత్వం ఆమోదం తెలుపుతున్నట్లు ప్రకటించారు.

Tags: Shower of boons for Railway Kodur; CM makes key announcements.