లక్కిరెడ్డిపల్లి ముచ్చట్లు:
ఎపి ఈఏపి సెట్ లో ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీలో మండలంలోని కుర్నూతుల పంచాయతీలోని మంగళపల్లికి చెందిన టివి సుదీక్షణ శర్మ 80.83 మార్కులు సాధించి అన్నమయ్య జిల్లా టాపర్గా నిలిచాడు. మండలంలోని కుర్నూతుల పంచాయతీలోని మంగళపల్లి చెందిన శ్రీనాథ్ శర్మ, మానస లకు జన్మించిన సుదీక్షన శర్మ ఎల్కేజీ నుంచి 8వ తరగతి వరకు రాయచోటి సాయి ఇనిస్ట్యూట్ స్కూల్లో, 9,10 తిరుపతి శ్రీ చైతన్య స్కూల్లో చదివి 10వ తరగతిలో కాలేజ్ టాపర్గా నిలిచాడు. ఇంటర్ మీడియట్ విజయవాడ శ్రీ చైతన్యలో చదివి ఈ ఎ పీ సెట్ లో అన్నమయ్య జిల్లా టాపర్గా నిలిచి జె ఈ ఈ మైన్స్ లో మంచి ర్యాంక్ సాధించి ముంబై సిఎస్సి బ్రాంచ్ లో ఐఐటి సీటు సాధించాడు. ఆయన ఎంపిక పట్ల కుటుంబ సభ్యులు, కళాశాల ప్రిన్సిపల్,బంధువులు, స్నేహితులు, గ్రామస్తులు అభినందనలు తెలిపారు.

Tags: Lakkireddypalli resident ranks first in AP EAPSET Engineering