బీహార్ ముచ్చట్లు:
ఎస్పీ ఆదేశాలతో వేగంగా స్పందించిన పోలీసులు…
బీహార్ రాష్ట్రంలోని నవాడ జిల్లా, బహదూర్‌పూర్ గ్రామానికి చెందిన రంజిత్ చౌదరి (తండ్రి: రామేశ్వర్ చౌదరి) బెంగళూరులో ట్రక్కు డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
ఈ నెల 26-06-2026న స్వగ్రామం నుంచి బెంగళూరుకు బయలుదేరిన రంజిత్ చౌదరి ప్రయాణ మధ్యలో హిందూపురం రైల్వే స్టేషన్‌లో దిగాడు. అనంతరం మానసిక స్థితి సరిగా లేకపోవడంతో పట్టణంలోని రహమత్‌పూర్ ప్రాంతంలో సంచరిస్తూ కనిపించాడు. ఈ సమయంలో తన మొబైల్ ఫోన్‌ను ఒక టైలర్ షాపులో ఛార్జింగ్ కోసం ఉంచి వెళ్లిపోయాడు. తిరిగి అక్కడికి రాకపోవడంతో అతని ఆచూకీ తెలియకుండా పోయింది.
ఎస్పీకి ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు…
రంజిత్ చౌదరి కోసం కుటుంబ సభ్యులు హిందూపురం వరకు వచ్చి అనేక ప్రాంతాల్లో గాలించినప్పటికీ సమాచారం లభించలేదు. దీంతో అతని కుమారుడు శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ కి మొబైల్-3 ద్వారా ఫిర్యాదు చేశారు.
ప్రత్యేక గాలింపుతో ఆచూకీ గుర్తింపు
ఫిర్యాదు అందుకున్న వెంటనే జిల్లా ఎస్పీ స్పందించి హిందూపురం టూ టౌన్ పోలీసులకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఎస్పీ ఆదేశాల మేరకు హిందూపురం టూ టౌన్ సీఐ అబ్దుల్ కరీం పర్యవేక్షణలో పోలీస్ సిబ్బంది ప్రత్యేక బృందాలుగా ఏర్పడి పలు ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. సాంకేతిక ఆధారాలు, స్థానిక సమాచారం ఆధారంగా విచారణ జరిపి రంజిత్ చౌదరిని క్షేమంగా గుర్తించారు.
కుటుంబ సభ్యులకు అప్పగింత…
రంజిత్ చౌదరి ఆచూకీ లభించిన వెంటనే అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం అతనిని అతని అల్లుడు సోను చౌదరికి అప్పగించారు.
పోలీసులకు కృతజ్ఞతలు తెలిపిన కుటుంబ సభ్యులు..
తమ కుటుంబ సభ్యుడిని సురక్షితంగా గుర్తించి అప్పగించినందుకు జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ కి, హిందూపురం టూ టౌన్ పోలీసులకు రంజిత్ చౌదరి కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజలకు పోలీసుల విజ్ఞప్తి
కుటుంబ సభ్యుల నుంచి దూరమైన వారు, తప్పిపోయిన వ్యక్తులు లేదా మానసిక స్థితి సరిగా లేని వ్యక్తులు ఎవరైనా కనిపించినట్లయితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని హిందూపురం టూ టౌన్ సీఐ అబ్దుల్ కరీం ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Tags: Police handed over the missing person to family members.