July 1, 2026
Explore
రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్

రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్

July 1, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

జిల్లాలోని రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు.
బుధవారం రాష్ట్ర సచివాలయం నుంచి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్, భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) జి. జయలక్ష్మితో కలిసి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, జిల్లా జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ, డీఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు.


ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో రీ సర్వే (Resurvey), పట్టాదారు పాస్ పుస్తకాల (PPB) పంపిణీ, 22-ఏ భూముల సమస్యల పరిష్కారం, మాన్యువల్ రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్, అటవీ భూములకు సంబంధించిన అంశాలపై సమీక్ష నిర్వహించారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో సీసీఎల్ఏ & ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జిల్లాల వారీగా పనుల పురోగతిని సమీక్షిస్తూ, పెండింగ్‌లో ఉన్న అంశాలను నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. రీ సర్వే, 22-ఏ భూముల సమస్యల పరిష్కారం, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీని వేగవంతం చేయాలని ఆదేశించారు. అలాగే రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్‌ను పూర్తి చేసి, అటవీ భూములకు సంబంధించిన అంశాలను సమన్వయంతో పరిష్కరించాలని సూచించారు.


వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సంబంధిత శాఖల అధికారులతో జిల్లా పరిస్థితిపై సమీక్ష నిర్వహించి, రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో సంబంధిత రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags: Special focus on revenue issues: Collector