July 1, 2026
Explore
హత్యా, ఘర్షణ కేసులో నిందితులకు 7 ఏళ్ల జైలు శిక్ష

హత్యా, ఘర్షణ కేసులో నిందితులకు 7 ఏళ్ల జైలు శిక్ష

July 1, 2026 | Andhra Pradesh

మాకవరపాలెం హత్యా, ఘర్షణ కేసులో నిందితులకు 7 ఏళ్ల జైలు శిక్ష, భారీ జరిమానా: సంచలన తీర్పు వెలువరించిన న్యాయస్థానం

నిందితుల బెయిల్ బాండ్లు రద్దు – జుడీషియల్ కస్టడీకి రిమాండ్

పోలీస్, ప్రాసిక్యూషన్ యంత్రాంగాన్ని అభినందించిన జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఐపీఎస్

అనకాపల్లి ముచ్చట్లు:

మాకవరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో 2008లో జరిగిన ఒక తీవ్రమైన ఘర్షణ మరియు వ్యక్తి మరణానికి సంబంధించిన కేసులో (Cr.No.79/08, SC.No.10/2015) గౌరవ న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. నేరం నిరూపితమైన ఏడుగురు నిందితులకు శిక్షలు ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని, నిందితులకు శిక్ష పడేలా చేయడంలో అత్యంత ప్రతిభ కనబరిచిన దర్యాప్తు అధికారులు, ప్రాసిక్యూషన్ విభాగం మరియు కోర్టు మానిటరింగ్ సిబ్బందిని అనకాపల్లి జిల్లా పోలీస్ ఎస్పీ తుహిన్ సిన్హా ప్రత్యేకంగా అభినందించారు.

కేసు నేపథ్యం & నిందితుల వివరాలు:
​గ్రామాల్లో రాజకీయ విభేదాల నేపథ్యంలో 2008 డిసెంబర్ 2వ తేదీన మాకవరపాలెం మండలం, బురుగుపాలెం గ్రామంలో ఈ ఘర్షణ చోటుచేసుకుంది. నిందితులు కర్రలు, ఇనుప రాడ్లతో దాడి చేయడంతో రాజాన ఎర్రపాత్రుడు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
​ కోర్టు తీర్పు ప్రకారం ఈ క్రింది నిందితులపై నేరం నిరూపితమై శిక్షకు పాత్రులయ్యారు:
​రుత్తల శ్రీరామమూర్తి (A-1)
​రుత్తల సత్యనారాయణ (A-2)
​కారక పరదేశి @ పట్టేలు (A-3)
​కారక లక్ష్మణ (A-4)
​అల్లు సత్తిబాబు (A-5)
​శెట్టి రమణ (A-6)
​పల్లి సన్నిబాబు (A-8)
(గమనిక: ఈ కేసులో A-7 గా ఉన్న రాజన ఎర్ర పాత్రుడు విచారణ కాలంలో మరణించడంతో అతనిపై కేసు అబేట్ (Abated) అయింది).
న్యాయస్థానం తీర్పు – శిక్షల వివరాలు:
​ఎస్సీ ఎస్టీ కోర్టు మరియు XI అడిషనల్ జిల్లా న్యాయస్థానం (XI ADJ/VSP) ఈ కేసును సమగ్రంగా విచారించారు. నిందితులు A-1 నుండి A-6 మరియు A-8 లపై IPC సెక్షన్లు 147, 148, 324 r/w 149 మరియు 304 Part-II r/w 149 కింద నేరం నిరూపితమైనట్లు ప్రకటించారు.
న్యాయస్థానం ఖరారు చేసిన శిక్షల వివరాలు:
జైలు శిక్ష & జరిమానా: నిందితులకు ఒక్కొక్కరికి 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు రూ.25,000/- జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.

బాధితులకు పరిహారం: మృతి చెందిన రాజాన ఎర్రపాత్రుడు కుటుంబానికి పరిహారంగా రూ.1,75,000/- చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అలాగే నాటి ఘర్షణలో దెబ్బలు తగిలిన ముగ్గురు బాధితులకు ఒక్కొక్కరికి రూ.20,000/- చొప్పున మొత్తం రూ.60,000/- చెల్లించాలని న్యాయమూర్తి తమ తీర్పులో పేర్కొన్నారు.
​తీర్పు అనంతరం నిందితుల బెయిల్ బాండ్లను రద్దు చేస్తూ, వారిని జుడీషియల్ కస్టడీకి రిమాండ్ చేయాలని కోర్టు ఆదేశించింది.
పక్కా ఆధారాలతో దర్యాప్తు:
​ఈ కేసు దర్యాప్తును అప్పటి నర్సీపట్నం సబ్ డివిజన్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ASP) మరియు ప్రస్తుత దర్యాప్తు అధికారి డాక్టర్ నవీన్ గులాటి మరియు అప్పటి దిశా డి.ఎస్.పి మల్ల మహేష్ అత్యంత సమర్థవంతంగా నిర్వహించారు. సాక్ష్యాధారాలను, మెడికల్ రిపోర్టులను శాస్త్రీయంగా సేకరించి కోర్టులో పక్కాగా చార్జ్ షీట్ దాఖలు చేశారు.
​ న్యాయస్థానంలో ప్రాసిక్యూషన్ తరఫున సమర్థవంతంగా వాదనలు వినిపించి, సాక్షులను సరిగ్గా ప్రవేశపెట్టిన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (PP) బి.మీన నిందితులకు శిక్ష పడేలా చేయడంలో కీలక పాత్ర పోషించారు.


​ఎస్పీ అభినందనలు:
​ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ… బాధితులకు న్యాయం చేకూర్చడానికి 2008 నుండి నిరంతరం శ్రమించిన మాకవరపాలెం పోలీస్ స్టేషన్ సిబ్బందిని, కోర్టు మానిటరింగ్ సెల్ సిబ్బందిని హృదయపూర్వకంగా అభినందించారు. పోలీస్ మరియు ప్రాసిక్యూషన్ విభాగాల సమష్టి కృషి వల్లే ఇన్నేళ్లకైనా బాధితులకు సరైన న్యాయం, నిందితులకు కఠిన శిక్ష పడడం సాధ్యమైందని, భవిష్యత్తులో కూడా నేరస్థులకు శిక్ష పడేలా ఇలాగే బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Tags: 7-year jail term for accused in murder and clash case