July 1, 2026
Explore
వ్యవసాయ బోర్ల కేబుల్‌వైర్లు చోరీ

వ్యవసాయ బోర్ల కేబుల్‌వైర్లు చోరీ

July 1, 2026 | Andhra Pradesh

దొంగను పట్టించిన గ్రామస్తులు

  • ముగ్గురు పరారీ

పుంగనూరుముచ్చట్లు:

రైతులకు చెందిన వ్యవసాయ బోర్లకు వినియోగించే రాగి కేబుల్‌వైర్లను చోరీ చేసిన దొంగలను గ్రామస్తులు పట్టుకునేందుకు ప్రయత్నించగా ముగ్గురు పరారీ కాగా ఒక్కరు దొరికిన సంఘటన మండలంలోని మాగాండ్లపల్లె వద్ద జరిగింది. బుధవారం గ్రామస్తులు తెలిపిన మేరకు మంగళవారం రాత్రి 12 గంటల సమయంలో బోర్ల వద్ద ఇతర వ్యక్తులు ఉన్నట్లు సీసీ కెమెరాలలో గుర్తించారు. వారిని పట్టుకునేందుకు గ్రామస్తులు వెంబడించారు. ఒకరిని పట్టుకోగా, ముగ్గురు పరారైయ్యారు. వీరందరు ఆప్రాంతంలోని సుమారు క్వింటాలు కేబుల్‌ వైర్లను కత్తరించి, సమీపంలోని కాలువలో వేసి , వాటిని దగ్ధం చేసి రాగివైరు తీసే ప్రయత్నం చేస్తుండటాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించి పట్టుకున్న దొంగను పోలీసులకు అప్పగించారు. పోలీసుల దర్యాప్తులో దొంగల వివరాలు తెలియరావాల్సి ఉంది. కాగా గత నెల రోజులుగా కేబుల్‌వైర్లు , ట్రాన్స్ఫార్మర్ల దొంగతనాలు ఎక్కువ కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వేలాది రూపాయలు విలువ చేసే కేబుల్‌ వైర్లను దొంగలు కత్తరించుకెళ్లడంతో రైతులకు నష్టం వాటిల్లుతోంది. దీనిపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకుని , రాత్రి సమయాల్లో సచివాలయ పోలీసులు , గ్రామస్తులతో కలసి నిఘా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

Tags: Cables of agricultural borewells stolen