July 1, 2026
Explore
అంబేద్కర్‌ విగ్రహ ఏర్పాటును అడ్డుకుంటున్న రెవెన్యూ

అంబేద్కర్‌ విగ్రహ ఏర్పాటును అడ్డుకుంటున్న రెవెన్యూ

July 1, 2026 | Andhra Pradesh

విగ్రహం ఏర్పాటు చేసి తీరుతామంటున్న దళితులు

పుంగనూరుముచ్చట్లు:

కోట్లాది రూపాయలు విలువ చేసే చెరువులు , కాలువలు, ప్రభుత్వ భూములు దురాక్రమణ జరుగుతున్న నిద్ర మత్తులో జోగుతున్న రెవెన్యూ అధికారులు అంబేద్కర్‌ విగ్రహ ఏర్పాటును మాత్రం బుధవారం అడ్డుకోవడం తీవ్ర విమర్శలకు, ఘర్షణలకు దారితీస్తోంది. మండలంలోని నల్లూరుపల్లె గ్రామ సమీపంలోని కొంత కుంట పొరంబోకు స్థలంలో దళిత నాయకుడు శంకరప్ప డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ విగ్రహ ఏర్పాటుకు గత ఏడాది ప్రారంభించారు. ఆ సమయంలో గ్రామస్తులు అడ్డుకోవడంతో రెవెన్యూ అధికారులు విగ్రహం ఏర్పాటు చేసుకోమని అనుమతి ఇచ్చారు. గత ఆరు నెలలుగా దళిత నాయకులు విగ్రహ ఏర్పాటుకు భూమి చదును చేసి , పునాదులు వేసి లక్షలాది రూపాయలు ఖర్చుచేశారు. ప్రస్తుతం కొంత మంది ప్రోద్భలంతో తహశీల్ధార్‌, ఆర్‌ఐ, వీఆర్‌వో , తలారి కలసి పనులను అడ్డుకోవడంతో దళిత నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. శంకరప్ప మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ విగ్రహాలను ఎవరైన ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం జీవో జారీ చేసిందని, కానీ రెవెన్యూ అధికారులు కావాలనే దళితులను అడ్డుకుని , విగ్రహ ఏర్పాటు జరగనివ్వడం లేదని ఆరోపించారు. దీని కారణంగా ఘర్షణలు జరుగుతోందని, దీని కారణం రెవెన్యూ అధికారులేనని ఆయన ఆరోపించారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా చేసి, రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తామని, విగ్రహా ఏర్పాటు చేసి తీరుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో దళిత నాయకులు పెంచుపల్లి కృష్ణప్ప, కుమార్‌, విజయ్‌, కృష్ణప్ప, నాగరాజు, హనుమప్ప, అగిస్తిప్ప, చిన్నరెడ్డెప్ప, శివ, నారాయణస్వామి, సూరి, రెడ్డెన్న తదితరులు పాల్గొన్నారు.

Tags: Revenue officials obstructing the installation of the Ambedkar statue.