July 1, 2026
Explore
డెంగ్యూ జ్వరాలపై అప్రమత్తంగా ఉండాలి

డెంగ్యూ జ్వరాలపై అప్రమత్తంగా ఉండాలి

July 1, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో డెంగ్యూ జ్వరాలు ప్రభలే అవకాశం ఉందని, దీని పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి, నివారణ చర్యలు చేపట్టాలని అర్భన్‌ పిహెచ్‌సి డాక్టర్‌ జయంత్‌సాయి అన్నారు. బుధవారం తూర్పువెహోగసాల పిహెచ్‌సిలో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవాలను సిబ్బందితో కలసి ర్యాలీ నిర్వహించారు. ఇంటి పరిసరాలలో దోమలు ప్రభలకుండ నీటి నిల్వలు తొలగించాలన్నారు. అలాగే దోమ కాటుకు గురికాకుండ దోమతెరలు వినియోగించడం, ఫాగింగ్‌ చేయాలని సూచించారు. ఈ మేరకు కరపత్రాలు పంపిణీ చేశారు.

Tags: One must remain vigilant about dengue fever.